telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

60 ఏళ్ల మహిళ కేక్ తినే పోటీలో… చివరకు…?

Cake

ఆస్ట్రేలియా డే సందర్భంగా క్వీన్స్‌ల్యాండ్‌లోని బీచ్ హౌస్ హోటల్‌లో కేక్ ఈట్ పోటీలను నిర్వహించారు. ఆస్ట్రేలియాలో ఫేమస్ అయిన ల్యామింగ్‌టన్ కేకులను ఈ పోటీలో ఉంచారు. ఈ పోటీలో పాల్గొన్న 60 ఏళ్ల మహిళ ల్యామింగ్‌టన్ కేకులను వెంట వెంటనే తినడానికి ప్రయత్నించింది. కొన్ని కేక్ పీసెస్ తిన్న వెంటనే మహిళ మూర్చపోయింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ లాభం లేకపోయింది. దీంతో హోటల్ యాజమాన్యం, సిబ్బంది ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఆహ్లాదకరంగా జరుగుతున్న పోటీలో ఇలా మహిళ ప్రాణాలను పోగొట్టుకోవడం తమకు ఎంతో బాధగా ఉందంటూ హోటల్ యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది. తాము ఫోన్ చేసిన నిమిషాల్లో హోటల్‌కు చేరుకున్న అంబులెన్స్ సర్వీసుకు హోటల్ సిబ్బంది ధన్యవాదాలు తెలిపింది. కాగా.. మహిళ మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని పోలీసులు తెలిపారు.

Related posts