telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సాంస్కృతికతకు పుట్టినిల్లు ఓరుగల్లు: వెంకయ్య

venkaiah naidu

సాహిత్య, సాంస్కృతికతకు పుట్టినిల్లు ఓరుగల్లు అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వరంగల్‌లో ని ఏవీవీ కాలేజీలో ప్లాటినమ్‌ జూబ్లీ వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడుకలకు హాజరైన వెంకయ్య ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏవీవీ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు చందా కాంతయ్య పలువురికి ఆదర్శమన్నారు. నాటి నిజాం పాలకులను మెప్పించి తెలుగుభాషలో ఈ విద్యాసంస్థను ఏర్పాటు చేయడం స్ఫూర్తి దాయకమన్నారు.

సాంస్కృతిక వారసత్వం, రామప్ప, వేయిస్తంబాల దేవాలయాలు వరంగల్ కే తలమానికమని అన్నారు. వారసత్వ సంపదగా వచ్చిన చెరువులను కాపాడుకోవాలన్నారు. . తెలంగాణ ప్రభుత్వం చెరువుల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు వరంగల్‌కు స్మార్ట్ సిటీ ఇచ్చామని గుర్తు చేశారు. పలు ఇంగ్లీషు రచనల్లో కాకతీయుల కళావైభనం గురించి రాశారని తెలిపారు. పలు విద్యాసంస్థలతో విద్యాకేంద్రంగా వరంగల్ విరాజిల్లుతోందన్నారు.

Related posts