telugu navyamedia
రాజకీయ వార్తలు

మాతృభాషతో పాటు ఇతర భాషలు నేర్చుకోవడంలో తప్పులేదు: వెంకయ్య

venkaiah naidu

మాతృభాషతో పాటు ఇతర భాషలు నేర్చుకోవడంలో తప్పు లేదని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. గవర్నర్ల సదస్సులో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాతృభాషను ప్రోత్సహించడం, కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంపై ప్రతి ఒక్కరూ చొరవ చూపాలన్నారు. ఒక ప్రాంత సంస్కృతికి అక్కడి ప్రజల మాతృ భాషే జీవనాడి అని అన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 350-ఏ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు మాతృభాషలోనే విద్యాభ్యాసం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలు మాతృభాషలోనే ప్రాధమిక విద్యాభ్యాసం జరిగేలా చొరవ తీసుకోవాలని అన్నారు. అన్ని భారతీయ భాషలకు సరైన గౌరవం దక్కాలని,, కానీ భారతీయ భాషలకు ప్రమాదకర పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలని పేర్కొన్నారు.

Related posts