telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఏపీకి తుఫాను హెచ్చరికలు .. అప్రమత్తంగా ఉండాలంటున్న .. వాతావరణ శాఖ ..

ఇప్పటికే అకాల వర్షాలతో రైతన్నలు ఇబ్బందులు పడుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాన్ హెచ్చరిక జారీచేసింది వాతావరణ శాఖ. హిందూ మహా సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. శనివారం ఉదయం నాటికి తుఫాన్‌గా మారే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాన్‌కు ఫణి అనే పేరు పెట్టారు.

ఈ నెల 30న ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తాంధ్రల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనావేస్తోంది. తుఫాన్ ప్రభావం ఈ నెల 28 నుంచి మొదలవనుంది. ఉత్తర తమిళనాడుతో పాటు దక్షిణకోస్తాలో ఈదుగాలులు వీచే అవకాశముంది. 28న కృష్ణా, గుంటూరు,ప్రకాశం, నెల్లూరు జిల్లాలో గంటకు 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. 29న కోస్తాతో పాటు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. భారీ ఈదరుగాలులతో పాటు పలు చోట్ల పిడుగులు పడే అవకాశమున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.

Related posts