హిమయత్ సాగర్ రిజర్వాయర్ పరీవాహక ప్రాంతంలో ఇటీవల వర్షపాతం కారణంగా రిజర్వాయర్ లోకి వరద నీరు 1762.271 అడుగులు (2.654 టిఎంసి)కు చేరుకుంది. భారత వాతావరణ శాఖ సూచన నివేదిక ప్రకారం రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అయితే హిమయత్ సాగర్ రిజర్వాయర్ యొక్క గేట్లు 1763.00 అడుగుల స్థాయికి చేరుకున్నతరువాత ఎప్పుడైనా గేట్లు ఎత్తే అవకాశం ఉంటుంది. అయితే హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హిమయత్ సాగర్ లోకి భారీ వరద వస్తుంది జలమండలి ఎండీ దాన కిషోర్, ఐఏఎస్ హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగంతో పాటు.. జీహెచ్ ఎంసీ, పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. అయితే హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.271 అడుగులకు చేరింది. ఇక రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం – 2.968 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.654 టీఎంసీలుగా ఉంది.
previous post