telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

తెలంగాణ బిజేపిలో ముసలం !

బిజేపిలోకి ఈటల వస్తున్నాడన్న వార్తతో పార్టీలో నూతన ఉత్సాహం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈటల చేరికపై ఫుల్ బిజీగా ఉన్న తెలంగాణ బిజేపికి షాక్ తగిలింది. పెద్దపల్లి బిజేపిలో ముసలం నెలకొంది. మాజీ ఎంపీ వివేక్ పై అసంతృప్తి నేతలు తిరుగుబాటుకు దిగారు. ఈ రోజు మంచిర్యాలలో అసమ్మతి నేతలు సమావేశం కానున్నారు. వివేక్ తీరుపై మాజీ మంత్రి బోడ జనార్ధన్, మాజీ ఎమ్యెల్యేలు గుజ్జుల రామకృష్ణ రెడ్డి, సోమారపు సత్యనారాయణ తదితర నేతలు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అసంతృప్తితో గతంలో జిల్లా అధ్యక్ష పదవీకి సోమారపు రాజీనామా చేయగా.. అధిష్టానం చొరవతో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి పెద్దపల్లి బిజేపిలో ముసలం ఏర్పడింది. ఇందులో భాగంగానే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అసంతృప్తి నేతలకు సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం అందినట్లు సమాచారం. ఈ సమావేశంలో వివేక్ పై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చ జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts