ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే ఐదు రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉండనున్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కవితని కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో, ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ఐదు రోజులు పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అందుబాటులో ఉండటం లేదు. ఇక నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విజయం మొదటి రౌండ్లోనే ఖరారైన విషయం తెలిసిందే . మొత్తం 821 ఓట్లకు గాను కవితకు 531 ఓట్లు లభించాయి. 8 ఓట్లు చెల్లకుండా పోయాయి. కాంగ్రెస్ అభ్యర్థి సుభాష్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణలకు డిపాజిట్లు కూడా దక్కలేదు. తొలి రౌండ్‌లో బీజేపీకి 39, కాంగ్రెస్‌కు 22 ఓట్లు లభించాయి. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాగా… మొత్తం 823 ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు 728 ఓట్లు వచ్చాయి.. బీజేపీ అభ్యర్థికి 56 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి 29 ఓట్లతో సరిపెట్టుకున్నారు.. చెల్లని ఓట్లు 10 ఉన్నట్టు అధికారులు తెలిపారు.
previous post
కేటీఆర్ ఫోన్ చేయగానే ఈటల తుస్సుమనిపించాడు: రేవంత్ రెడ్డి