థాయిలాండ్ రాజు ఒక సాదారణ యువతిని పెళ్లి చేసుకుని అందరిని ఆశ్చర్యపర్చాడు. ప్రతి ఒక్కరిలో ప్రేమ అనేది పుడుతుంది. ప్రేమ పుట్టినప్పుడు అతడు రాజా లేదా బంటా అనే విషయం అక్కర్లేదు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఎంత దూరం అయినా వెళ్లేందుకు సిద్ద పడతారు. అద్బుతమైన ప్రేమ ఫీలింగ్‌లో మునిగి పోయిన థాయిలాండ్ రాజు వజిరలోంగ్ కార్న్ తాను అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
థాయిలాండ్ రాజు భూమిబోల్ 2016లో మరణించిన తర్వాత వజిరలోంగ్ కార్న్ రాజు అయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది. ఆయన ప్రమాణ స్వీకారంకు అన్ని సిద్దం అవుతున్నాయి. తండ్రి స్థానంను త్వరలోనే స్వీకరించబోతున్న వజిరలోంగ్ తాజాగా పెళ్లితో తాను ప్రేమించిన సుతిద టిడ్జాల్‌ను వివాహం చేసుకుంది. గత అయిదు సంవత్సరాలుగా వీరిద్దరి మద్య ప్రేమ వ్యవహారం సాగుతోంది. 2014 సంవత్సరం వరకు ఆమె థాయిలాండ్ ఎయిర్ సర్వీస్‌లో ఉద్యోగం చేసేది. ఆమెను తన ఆంతరంగిక సెక్యూరిటీ ఆఫీసర్‌గా వజిరలోంగ్ నియమించుకున్నాడు.
ఆమెపై ఉన్న అభిమానంతో ఎప్పుడు తన పక్కనే ఉంచుకునేవాడు. వీరిద్దరి ప్రేమ గురించి చాలా రోజులుగా ప్రచారం అయితే జరిగింది, కాని రాజుగారు ఆమెను పెళ్లి చేసుకుంటారా అనే అనుమానాలు అయితే వ్యక్తం అయ్యాయి. అయితే వజిరలోంగ్ తాజాగా తాను ప్రేమించిన ఆమెను వివాహం చేసుకున్నాడు. అయిదు సంవత్సరాలుగా తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్న రాజుగారు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. రాజు అయినా కూడా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని గొప్ప పేరు దక్కించుకున్నాడు.