telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

సీయూ సెట్ .. నోటిఫికేషన్ విడుదల..

cu cet 2019 notification released

సెంట్రల్‌ యూనివర్సిటీస్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూసెట్‌) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఒక్క ప్రవేశ పరీక్ష తో ఇంటిగ్రేటెడ్‌/ అండర్‌ గ్రాడ్యుయేట్‌, పీజీ, రిసెర్చి కోర్సుల్లో సీట్లలో మీకు కావాల్సిన దానికోసం అర్హత పొందవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న 14 కేంద్రీయ విశ్వవిద్యాలయాలూ, బెంగళూరు డా. బీఆర్‌ అంబేద్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌.. వీటిలో ఏదో ఒక కోర్సులో జాయినవ్వాలనే ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్‌ 13లోగా దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్‌ అభ్యర్థులకు సీయూ సెట్‌ ఫీజు రూ. 800.ఎస్‌సీ, ఎస్‌టీవారు రూ.350 చెల్లిస్తే సరిపోతుంది. పీడబ్ల్యూడీ దరఖాస్తుదారులు ఎలాంటి ఫీజూ చెల్లించనవసరం లేదు. సీయూ సెట్‌లో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశాలు లభిస్తాయి. సీయూ సెట్‌ మే 25, 26 తేదీల్లో నిర్వహిస్తారు. ఆఫ్‌లైన్‌ పద్ధతిలో జరిగే ఈ పరీక్షలో ఓఎంఆర్‌ షీట్‌లో జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. జూన్‌ 21న ఫలితాలను ప్రకటిస్తారు. ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ప్రతి తప్పు జవాబుకూ 0.25 రుణాత్మక మార్కులుంటాయి. రిసెర్చి ప్రోగ్రాములకు మాత్రం నెగిటివ్‌ మార్కుండదు.

* పార్ట్‌-ఎలో 25 బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి. లాంగ్వేజ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, మేథమెటికల్‌ ఆప్టిట్యూడ్‌, అనలిటికల్‌ స్కిల్స్‌ను పరీక్షిస్తారు.
* పార్ట్‌-బిలో 75 బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి. దీనిలో అభ్యర్థి డొమైన్‌ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. ప్రతి విభాగంలో 25 ప్రశ్నలుంటాయి.

వెబ్‌సైట్‌: www.cucetexam.in


కోర్సులు :

కర్ణాటక సెంట్రల్‌ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ ఎమ్మెస్సీ కోర్సు అందిస్తోంది. 
* ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ కోర్సు రాజస్థాన్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఉంది. 
* ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ బయో టెక్నాలజీ కోర్సు రాజస్థాన్‌, కాశ్మీర్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలు అందిస్తున్నాయి. 
* ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ బోటనీ జమ్మూ సెంట్రల్‌ యూనివర్సిటీలో చదువుకోవచ్చు. 
* ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సు రాజస్థాన్‌, తమిళనాడు, జమ్మూ సెంట్రల్‌ యూనివర్సిటీలు అందిస్తున్నాయి. 
* ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు రాజస్థాన్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో పూర్తిచేసుకోవచ్చు. 
* ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ/ ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌ కోర్సును కర్ణాటక, రాజస్థాన్‌, తమిళనాడు సెంట్రల్‌ యూనివర్సిటీలతోపాటు బీఆర్‌ అంబేద్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, బెంగళూరు అందిస్తున్నాయి. 
* ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ ఇంగ్లిష్‌ కర్ణాటక సెంట్రల్‌ యూనివర్సిటీలో ఉంది. 
* ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ రాజస్థాన్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ అందిస్తోంది. 
* ఎమ్మెస్సీ జాగ్రఫీ, జియాలజీ కోర్సులకు కర్ణాటక సెంట్రల్‌ వర్సిటీలో చేరిపోవచ్చు. 
* లైఫ్‌ సైన్సెస్‌లో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీని తమిళనాడు సెంట్రల్‌ యూనివర్సిటీ అందిస్తోంది. 
* మ్యాథ్స్‌లో రాజస్థాన్‌, తమిళనాడు, కాశ్మీర్‌; మైక్రోబయాలజీ రాజస్థాన్‌, ఫిజిక్స్‌ రాజస్థాన్‌, కాశ్మీర్‌, తమిళనాడు, జమ్మూ; సైకాలజీ కర్ణాటక, సోషల్‌ మేనేజ్‌మెంట్‌ -గుజరాత్‌, స్టాటిస్టిక్స్‌ రాజస్థాన్‌, జువాలజీ జమ్మూ, కాశ్మీర్‌ యూనివర్సిటీల్లో చదువుకోవచ్చు.


యూజీ స్థాయిలో …:

కొత్త కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో యూజీ కోర్సులకు సీయూసెట్‌ ద్వారా ప్రవేశం లభిస్తుంది. 
* ఏపీ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆనర్స్‌ విధానంలో బీఎస్సీ ఎకనామిక్స్‌, బీఏ పొలిటికల్‌ సైన్స్‌ కోర్సులు ఉన్నాయి. టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఐటీలో ఈ సంస్థ బ్యాచిలర్‌ స్థాయిలో ఒకేషనల్‌ కోర్సులు అందిస్తోంది. 
* జమ్మూ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఇంటర్‌తో బ్యూటీ వెల్‌నెస్‌లో డిప్లొమా కోర్సు ఉంది. ఇదే సంస్థ బ్యూటీ వెల్‌నెస్‌ (మేకప్‌) కోర్సు అందిస్తోంది. 
* హర్యానా సెంట్రల్‌ యూనివర్సిటీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ స్టడీస్‌లో భాగంగా బయో మెడికల్‌ సైన్సెస్‌, ఇండస్ట్రియల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌ అండ్‌ లాజిస్టిక్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు అందిస్తున్నారు. 
* గుజరాత్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఆనర్స్‌ విధానంలో బీఏ చైనీస్‌, బీఏ జర్మన్‌ స్టడీస్‌ కోర్సులు నిర్వహిస్తోంది. 
* కర్ణాటక సెంట్రల్‌ యూనివర్సిటీ ఒకేషనల్‌ విధానంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌, షుగర్‌ టెక్నాలజీ కోర్సులు అందిస్తోంది. 
* తమిళనాడు సెంట్రల్‌ యూనివర్సిటీ బ్యాచిలర్‌ ఆఫ్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ మ్యూజిక్‌ కోర్సు నడుపుతోంది. 
* జమ్ము సెంట్రల్‌ యూనివర్సిటీ రిటైల్‌ మేనేజ్‌మెంట్‌, టూరిజం మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ఒకేషనల్‌ డిగ్రీతోపాటు డిప్లొమా కోర్సు అందిస్తోంది. ఇదే సంస్థ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో ఒకేషనల్‌ కోర్సు అందిస్తోంది.

 

Related posts