telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

మీ .. పాస్ వార్డ్ తో .. తిప్పలు..మీకే .. !

strong password is very important

సాధారణంగా హ్యాకర్లు ఏ అకౌంట్‌ను హ్యాక్‌ చేయడానికైనా అనేక పద్ధతులు పాటిస్తారు. మొదట మీ పేరు, తదితర ప్రాథమిక అంశాలను పరిశీలించి.. ఊహించి పాస్‌వర్డ్‌లను టైప్‌ చేసి ప్రయత్నిస్తారు. ‘బ్రూట్‌ ఫోర్స్‌ అటాక్‌’ అనేది మరో పద్దతి. ఇది ఒక కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌. దీని ద్వారా పదాలు, సంఖ్యలు, సింబల్స్‌ను కలిపి వీలైనన్నీ పాస్‌వర్డ్‌లను రూపొందించి మీ అకౌంట్‌కు ఉన్న పాస్‌వర్డ్‌ను కనిపెట్టే అవకాశముంది. అలా జరగకూడదంటే.. మీరు మీ పాస్‌వర్డ్‌ను వీలైనన్నీ ఎక్కువ అక్షరాలు, సంఖ్యలు, సింబల్స్‌తో పెద్ద పాస్‌వర్డ్‌ను పెట్టుకోవడం మంచిది.

ఎక్కువగా అందరూ పాస్ వార్డ్ గా వాడేది, తమ పేర్లు, పుట్టిన రోజు, లేదా 12345 లే. ఇలాంటివి హ్యాకర్లు చాలా సులభంగా కనిపెట్టేస్తారు. అందుకే ఎవరూ గ్రహించ లేకుండా అర్థం లేని, క్రమం లేని పదాలను, సంఖ్యలను పాస్‌వర్డ్‌గా పెట్టుకోండి.. దాన్ని మీరు మాత్రమే గుర్తుంచుకుంటే చాలు.. ఇంకెవరు ఆ పాస్‌వర్డ్‌ను కనిపెట్టలేరు. కేవలం పదాలతోనో, సంఖ్యలతోనో పాస్‌వర్డ్‌ పెట్టుకోవడమూ ప్రమాదమే.. చాలా తొందరగా పాస్‌వర్డ్‌ క్రాక్‌ అయ్యే అవకాశముంటుంది. అదే పదాలు, సంఖ్యలు, సింబల్స్‌, ఒక అక్షరం లోయర్‌కీ (స్మాల్‌ లెటర్‌), ఒక అక్షరం అప్పర్‌ కేస్‌ (బిగ్‌ లెటర్‌/క్యాపిటల్‌ లెటర్‌) ఇలా వైవిధ్యంగా ఉంటే పాస్‌వర్డ్‌ భద్రంగా ఉన్నట్టే.

ఇంకో తప్పేముంటే, అసలు చుట్టూ ఎవరైనా ఉన్నారా లేదా అన్నది చూడకుండానే పాస్‌వర్డ్‌ను టైప్‌ చేస్తుంటారు. ఇది అంత మంచిదికాదు. మీరు వీలైనంత గోప్యంగా పాస్‌వర్డ్‌ను వినియోగంచండి. ఎవరికి చెప్పొద్దు. అందరికి తెలిసేలా రాసిపెట్టడం.. పాస్‌వర్డ్‌ను సూచించేలా వస్తువులు పెట్టడం లాంటివి చేయకూడదు. అలాగే పబ్లిక్‌ వైఫై వినియోగిస్తున్నప్పుడు ఏ వెబ్‌సైట్లు, యాప్స్‌లో లాగిన్‌ అవకుండా ఉండటమే ఉత్తమం. ఎందుకంటే పబ్లిక్‌ వైఫై లక్ష్యంగా హ్యాకర్లు దాడి చేస్తుంటారు. ఎవరైనా ఈ వైఫైను ఉపయోస్తూ పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేస్తే అది హ్యాకర్లకు తెలిసిపోతుంది.

Related posts