telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

డేవిడ్ వార్నర్‌ ‘మహర్షి’ టీజర్‌.. అచ్చం మహేశ్‌ బాబు‌లానే..

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌ నటించిన అల వైకుంఠపురుములో సినిమాలోని “బుట్టబొమ్మ” పాటకు స్టెప్పులు వేసి అదరగొట్టేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ అప్పటి నుంచి.. టాలీవుడ్‌ హీరోల డైలాగులు, పాటలతో వీడియోలు చేస్తున్నాడు. ఈ ఏడాది అల్లు అర్జున్ వీడియోతో తన వీడియోల పరంపరను మొదలు పెట్టిన వార్నర్‌… మహేశ్‌ బాబు వీడియోతో 2020కి గుడ్‌ బై చెప్పాడు. మహేశ్‌ బాబు సినిమా “మహర్షి” సినిమా సీన్లకు రీఫేస్‌ యాప్‌తో తన ఫొటో పెట్టి మహేశ్‌లా కనపడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో యాప్‌ సాయంతో మహేశ్‌ బాబులా కనపడ్డాడు. స్కూటర్‌పై వెళ్తుండటం, “ఓడిపోవడం అంటే నాకు భయం” అని డైలాగులు చెబుతుండటం ఈ వీడియోలో చూడొచ్చు. ప్రపంచం మొత్తం నూతన సంత్సరానికి స్వాగతం పలుకుతూ 2020కి టాటా చెబుతున్న నేపథ్యంలో వార్నర్‌ ఈ వీడియోను రిలీజ్‌ చేశాడు. ఇప్పడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Related posts