telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్నేహ సీమంతం వేడుక… ఫోటోలు వైరల్

Sneha

తొలివలపు, ప్రియమైన నీకు, వెంకీ, రాధా గోపాళం, సంక్రాంతి, పాండు రంగడు, రాజన్న లాంటి అభినయ ప్రాధాన్య సినిమాలు స్నేహకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. స్నేహ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటించారు. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తరువాత తమిళంలో కొన్ని షోలకు జడ్జ్ గా వ్యవహరించారు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు స్నేహ. పెళ్ళైన తరువాత సెలక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటున్న స్నేహ ఈ సంవత్సరం విడుదలైన “వినయ విధేయ రామ” సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది. శివ‌కార్తికేయ‌న్ హీరోగా తెర‌కెక్కిన‌ వెలైక్కార‌న్ అనే చిత్రంలో ముఖ్య పాత్ర పోషించింది. ఆమె న‌టించిన ప‌ట్టాస్, వాన్ చిత్రాలు త్వర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. 2012 సంవత్సరంలో స్నేహకు తమిళ నటుడు ప్రసన్నతో వివాహమైంది. వీరిద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వీరికి నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్న ఒక బాబు ఉన్నాడు.ఈ బాబుకు విహాన్ అనే పేరు పెట్టారు. తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన స్నేహ తాను మరోసారి తల్లి కాబోతున్నానని ప్రకటించింది. రెండోసారి తల్లి కాబోతూ ఉండటంతో కొద్ది రోజులుగా వరుసగా ఫోన్లు మెసేజ్ లు వస్తున్నాయని స్నేహ ఇంటర్వ్యూలో చెప్పారు. “అచ్చముండు అచ్చముండు” సినిమా షూటింగ్ సమయంలో ప్రసన్న, స్నేహ ప్రేమలో పడ్డారు. స్నేహ భర్త ప్రసన్న తెలుగులో నాగార్జున “భాయ్” సినిమాలో ముఖ్య పాత్రలో నటించాడు. కాగా, ఆమె సీమంతం వేడుక‌ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి బంధువులు, స్నేహితులు హాజ‌ర‌య్యారు. స్నేహ‌.. త‌న సీమంతం వేడుక ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో వైర‌ల్‌గా మారాయి.

 

View this post on Instagram

 

Lovely 2nd baby shower pictures of #PunnagaiArasi #Sneha !! #snehaprasanna

A post shared by SS Music (@ssmusicofficial) on

Related posts