telugu navyamedia
సినిమా వార్తలు

సినిమాలకు దూరంగా… టూర్లకు దగ్గరగా సీనియర్ హీరోయిన్

Shriya

“గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి” చిత్రంతో చివరగా ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన శ్రియ ఇప్పుడు సినిమాలు ప‌క్క‌న పెట్టి త‌న భ‌ర్త‌తో విదేశాల‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. కొన్నాళ్ళుగా వెండితెర‌కి దూరంగా ఉంటోంది ఈ అమ్మడు. అయితే శ్రియ 2018లో ఆండ్రీ కొశ్చెవ్‌ని రాజ‌స్థాన్‌లో వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుండి వారిద్ద‌రు టూర్ల‌తోనే ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్నారు. ఈ మ‌ధ్య బ్రిట‌న్‌కి వెళ్ళిన శ్రియా ఆ త‌ర్వాత మెక్సికో, కోలంబియాకి వెళ్లింది. అక్క‌డి సంగ‌తుల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఇటీవల మెక్సికోలోని చీక‌టి గుహ‌లో శ్రియ డ్యాన్స్ చేయగా ఆ డ్యాన్స్ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. శ్రియ ప్రస్తుతం హిందీలో “తడ్కా” సినిమాలో, తమిళంలో ‘నరగాసురన్’, ‘సండకారి’ సినిమాలలో నటిస్తోంది.

Related posts