telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జూలై 20 నుంచి అక్కడ థియేటర్లు రీఓపెన్

Theatre

కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచంలోని అనేక దేశాల్లో సినిమా థియేటర్లను మూసేసిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ పుట్టిన చైనాలో కూడా థియేటర్లు ఓపెన్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గత కొన్ని రోజులుగా చైనాలో కేసులు అతి తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. జనవరి నుంచి చైనాలో సినిమా థియేటర్లు మూతపడ్డాయి. మార్చి నెలలో థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చినా, కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదవుతుండటంతో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. తాజాగా మరోసారి థియేటర్లు తెరిచేందుకు అనుమతి మంజూరు చేసింది. ఈనెల 20వ తేదీ నుంచి చైనాలో థియేటర్లు ఓపెన్ కాబోతున్నాయి. సామాజిక దూరం, మాస్కులు తప్పనిసరి అని ప్రభుత్వం ప్రకటించింది. మార్గదర్శకాలను పాటిస్తూ థియేటర్లు రన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక యూరప్ ఖండంలో కరోనా కంట్రోల్ అయ్యింది. దీంతో అక్కడ థియేటర్లు ఓపెన్ అయ్యాయి. అదే విధంగా అమెరికాలోనూ ఈరోజు నుంచి ఓపెన్ అవుతున్నాయి.

Related posts