కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ కొనసాగుతున్న కారణంగా సెలబ్రిటీలందరూ సోషల్ మీడియాకే పరిమితం అయ్యారు. సినిమా, సీరియళ్ళ షూటింగులు కూడా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు సెలెబ్రిటీలందరూ ఈ లాక్ డౌన్ టైంలో ఎలా గడుపుతున్నారో సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు తెలియజేస్తున్నారు. ఇక లాక్ డౌన్ కారణంగా దొరికిన ఈ సమయాన్ని సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన పిల్లలు సితార, గౌతమ్‌లతో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో మహేశ్ చేస్తున్న అల్లరికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే సితార గతంలో ‘భరత్ అనే నేను’ సినిమాలోని “అరరే ఇది కలలా ఉన్నదే…” అనే సాంగ్‌ను పాడింది. చాలా ఎనర్జటిక్‌గా పాడిన ఈ పాట నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. సితార పాడిన పాటకు సంబంధించిన పాత వీడియోను నమ్రత తాజాగా తన ఇన్‌స్టాలో తిరిగి పోస్ట్ చేస్తూ ‘నాన్న కూతురు’ అనే కామెంట్‌ను జతచేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొన్ని గంటల వ్యవధిల్లోనే లక్షకు పైగా వ్యూస్ రాగా వేలల్లో లైక్స్ వచ్చాయి.
View this post on Instagram
Daddy’s girl !! #MemoryTherapy❤️ One for each day💕💕💕 @sitaraghattamaneni