మన దేశాన్ని ప్రస్తుతం కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ ను గుర్తించడానికి జ్వరం, జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, రుచి, వాసన కొల్పోవడం వంటి లక్షణాలు ముఖ్యంగా ఉన్నాయి. అయితే కరోనా లక్షణాలుగా ఇప్పటి వరకూ ఉన్నవాటికి తోడుగా ఈ లిస్ట్ లో మరికొన్ని లక్షణాలు కూడా చేరాయి. కొంత మందిలో నాలుక ఎర్రబారడం, ఎండిపోవడం, దురదగా అనిపించడం, నాలుకపై గాయాలు కావడం వంటివి కూడా కరోనా లక్షణాలుగా గుర్తించారు. ఈ లక్షణాలు ఉంటే కరోనా టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ లక్షణాలను కొవిడ్ టంగ్ అని చెప్తున్నారు. ఈ లక్షణాలున్న వారిలో నీరసం కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కొవిడ్ టంగ్ లక్షణాలకు గల కారణాలు ఎంటి? కరోనా కారణంగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా మరేమైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై లోతైన అద్యయనం చేయాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి.
previous post
జగన్ సీఎం అయ్యాక ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయి: చంద్రబాబు