telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇది నెక్ట్స్ లెవల్ సినిమా… ‘ఆర్ఆర్ఆర్”పై సాయిమాధవ్ బుర్రా

SMB

మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా ఇప్పుడు టాలీవుడ్‌‌లో స్టార్ రైటరే కాదు బిజీ రైటర్ కూడా. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు మాటలు రాయడమే కాకుండా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘కంచె’, ‘మహానటి’, ‘గోపాల గోపాల’, ‘ఖైదీ నెంబర్ 150’ వంటి ఎన్నో చిత్రాలకు ఆయన డైలాగ్స్ అందించారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఎన్నో చిత్రాలకు ఆయన డైలాగ్స్ రాస్తున్నారు. అందులో ఒకటి ‘ఆర్ఆర్ఆర్’. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై ఎలాంటి క్రేజ్, అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల రామ్ చరణ్ బర్త్‌డే‌ని పురస్కరించుకుని విడుదల చేసిన వీడియోలో ఎన్టీఆర్ వాయిస్‌తో వచ్చిన డైలాగులు.. ఎలా పేలాయో తెలియంది కాదు. ఆ డైలాగ్స్ రాసింది కూడా సాయిమాధవ్ బుర్రానే. తాజాగా ఆయన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమాలో ఇద్దరి హీరోల పాత్రలకు సమానమైన ప్రాముఖ్యత ఉంటుందని ఆయన తెలిపారు. దర్శకుడు రాజమౌళి రెండు పాత్రలను ఎలా అయితే బ్యాలెన్స్ చేశారో.. తను కూడా అదే విధంగా.. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ అని కాకుండా సరిసమానంగా డైలాగ్స్ రాశానని అన్నారు. ఇక ఇద్దరు హీరోల పాత్రల నిడివి విషయంలో కూడా ఎవరికీ అనుమానం అవసరం లేదని తెలిపారు. ఇద్దరికీ సమానమైన నిడివి ఉంటుందని, అభిమానులు అస్సలు అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని సాయిమాధవ్ బుర్రా తెలిపారు. ప్రేక్షకులు ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు పెట్టుకున్నా.. సునాయాసంగా రీచ్ అవుతుందని, ఇది నెక్ట్స్ లెవల్ సినిమా అని సాయిమాధవ్ బుర్రా తన తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Related posts