telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లింగమార్పిడి కథతో రానున్న అదాశర్మ

Adah-Sharma

టాలీవుడ్ లో ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది అదాశర్మ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఫరవాలేదనిపించిన ఈ బ్యూటీకి మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ విన్యాసాలతో ఫోటో షూట్‌లు చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. త్వరలో లింగమార్పిడి కథాంశంతోనే ఒక మూవీ తెరకెక్కుతోంది. ఆ సినిమానే ‘మ్యాన్ టు మ్యాన్’ ఇందులో అదాశర్మ హీరోయిన్ గా నటిస్తుంది. అవుటాఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ తో ఇలా డేరింగ్ స్టెప్స్ వేస్తోన్న అదాశర్మ ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది. ఈ సినిమాలో పుట్టుకతో అబ్బాయి అయిన అదాశర్మపాత్ర.. లింగమార్పిడి ఆపరేషన్ ద్వారా అమ్మాయిగా మారుతుందట. కానీ ఈ విషయం తెలియని హీరో అదాను పెళ్ళి చేసుకుంటాడట. పెళ్ళయిన తర్వాత ఆమె కథ తెలుసుకున్న భర్త ఖంగు తింటాడని సమాచారం. లింగమార్పిడి పై మన సమాజంలో ఉన్న చిన్నచూపు.. అలాంటి శస్త్రచికిత్స ద్వారా మారిన వ్యక్తులు ఎదుర్కొనే ఇబ్బందులను ఎంటర్టెయినింగ్ గా చూపిస్తూ అదే సమయంలో అంతర్లీనంగా ఒక సోషల్ మెసేజ్ ఇస్తూ దర్శకుడు అబీర్ సేన్ గుప్తా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

Related posts