telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

పిల్లల పోస్టింగుల‌పై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి: సీపీ సజ్జనార్

cp sajjanar on disa accused encounter

క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్‌తో అంతా ఆన్‌లైన్ మ‌యం అయిపోయింది. ఇప్పటికే వివిధ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ సదుపాయాన్ని కల్పించాయి. కొన్ని స్కూళ్లు ఆన్‌లైన్ పాఠాలు ప్రారంభించ‌డంతో పిల్ల‌లు కూడా నెట్ ఎక్కువ‌గా వాడేస్తున్నారు. ప‌నిలోప‌నిగా అన్ని సోష‌ల్‌మీడియా యాప్‌లు డౌన్‌లోడ్ చేసిపోస్టులు పెడుతున్నారు. పిల్లల ఇంటర్నెట్ వినియోగంపై ఓ క‌న్నేసి ఉంచాల‌ని సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ చెబుతున్నారు. పిల్లలు సోష‌ల్ మీడియాలో చేసే పోస్టింగుల‌పై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నారు.

ఇంట‌ర్నెట్ ప్ర‌పంచాన్ని మొత్తం త‌న గుప్పిట్లోకి తెస్తుందని తెలిపారు. సైబర్ నేరగాళ్లు పొంచి ఉన్నారు.. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చ‌రించారు. పిల్లలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియాలో పిల్లలు యాక్టివ్ గా ఉండకుండా చూడాల‌ని త‌ల్లిదండ్రుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. సోషల్ మీడియాలో పిల్లల ఫొటోలు మార్ఫింగ్ చేసే అవకాశం ఉందని, ఆపై పిల్లలను బ్లాక్ మెయిల్ చేసే ప్ర‌మాదం కూడా పొంచిఉంద‌ని సూచించారు. 

Related posts