ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా.. హైదరాబాద్ సైతం 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్లో హైదరాబాద్ 7 పరుగులు చేయగా.. ఢిల్లీ 8 పరుగులు చేసి గెలుపొందింది. ఈ మ్యాచులో సన్‌రైజర్స్ అనుసరించిన వ్యూహాలపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘లక్ష్య ఛేదనలో జానీ బెయిర్‌స్టో 18 బంతుల్లో 38 పరుగులు చేశాడు. తన హిట్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. సూపర్ ఓవర్ జరుగుతున్న సమయంలో.. ఒకవేళ బెయిర్‌స్టో టాయిలెట్‌లో ఉండి ఉంటే తప్ప, అతడిని ఎందుకు ఆడించలేదో అర్థం కావడం లేదు. హైదరాబాద్ పోరాట పటిమ కనబరిచింది. కానీ వింతైన, అనూహ్య నిర్ణయాల కారణంగా వారిని వారు నిందించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది’ అని సెహ్వాగ్ సెటైర్ వేశాడు. ఇక నెటిజన్లు సైతం సెహ్వాగ్ అభిప్రాయాన్ని సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
previous post
జీఎస్టీతో చిన్న వ్యాపారులు నష్టపోయారు: రాహుల్