telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఎల్లుండి జరగాల్సిన ఈసెట్‌ పరీక్ష వాయిదా, ఎంసెట్‌ యథాతథం

*ఎల్లుండి జరగాల్సిన ఈసెట్ వాయిదా
*వ‌ర్షాల కార‌ణం వాయిదా వేస్తూ నిర్ణ‌యం

తెలంగాణ‌లో గ‌త కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ ఉన్నత విద్యా మండలి సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రవేశ పరీక్షల నిర్వహణపై కన్వీనర్లు, ఇతర సంబంధిత అధికారులతో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ సమీక్ష జరిపారు. ఈ నెల 13న జరగాల్సిన ఈసెట్‌ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. ఈసెట్ మళ్లీ ఎప్పుడు నిర్వహించాలనే విషయాన్ని తర్వాత ఖరారు చేస్తామని లింబాద్రి పేర్కొన్నారు.

అలాగే ఈనెల 14, 15 తేదీల్లో జరిగే ఎంసెట్‌, అగ్రికల్చర్‌ పరీక్షలు మాత్రం యథాతథంగా నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది. 18 నుంచి 20 వరకు జరిగే ఇంజినీరింగ్ ఎంసెట్ యథాతథంగా ఉంటుందని… షెడ్యూలులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు

Related posts