telugu navyamedia
సినిమా వార్తలు

అవన్నీ రూమర్స్ అంటున్న సూర్య

SJ-Surya

ఎస్‌జే సూర్య ద‌ర్శ‌కుడి నుండి న‌టుడిగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లి కాలంలో ఆయ‌న ఎక్కువ‌గా విల‌న్ పాత్ర‌ల‌లో క‌నిపిస్తున్నారు. స్పైడ‌ర్‌, మెర్స‌ల్ చిత్రాల‌లో సూర్య విలన్‌గా త‌న న‌ట విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించారు. అయితే అజిత్ తాజా చిత్రంలోను సూర్య విల‌న్‌గా క‌నిపించ‌నున్నార‌ని కొన్నాళ్ళుగా వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ వార్త‌ల‌ని సూర్య త‌న ట్విట్ట‌ర్ ద్వారా కొట్టి పారేశారు. “త‌ల అజిత్ 60వ చిత్రంలో నేను న‌టిస్తున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వం. అజిత్ స‌ర్, బోని క‌పూర్ గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది. ద‌యచేసి వారి చిత్రాల‌కి సంబంధించి త‌ప్పుడు ప్ర‌చారాలు చేయ‌కండి” అని సూర్య ట్వీట్‌ చేశారు.

అజిత్ ప్ర‌స్తుతం పింక్ రీమేక్‌గా “నెర్కొండ పార్వాయి” అనే చిత్రం చేస్తున్నారు. బోని క‌పూర్‌ నిర్మాణంలో ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. శ్రీదేవి కోరిక మేర‌కు అజిత్‌తో బోని పింక్ రీమేక్ చేస్తున్నాడు. ఖాకీ ఫేం హెచ్ వినోథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, అభిరామి వెంక‌టచ‌లం, ఆండ్రియా తరియంగ్‌లు ముఖ్య పాత్ర‌లలో క‌నిపించనున్నారు. నెర్కొండ పార్వాయి చిత్రంలో అజిత్ భార్య‌గా విద్యా బాల‌న్ న‌టిస్తుంది. గిబ్రాన్‌ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. నీరవ్‌షా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. అధిక్‌ రవిచంద్రన్‌, అర్జున్‌ చిదంబరం, అశ్విన్‌ రావు, సుజిత్‌ శంకర్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Related posts