మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్‌గా ఉంటారు. వ్యకిగత విషయాలతో పాటు సినిమా విషయాలు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటారు.
చిరంజీవి ఆంజనేయస్వామి పరమ భక్తుడని అందరికీ తెలిసిన విషయమే. శనివారం హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆచార్య సినిమా లొకేషన్స్‌లోని జరిగిన ఒక సంఘటనను ఆయన ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు.
చిరంజీవి , రామ్‌చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ఆచార్య . ఈ సినిమా దేవాలయాలు, వాటిలో జరుగుతోన్న అవినీతి కథాంశంతో రూపుదిద్దుకుంటుంది. ‘ఆచార్య సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో చిరంజీవి, రామ్‌చరణ్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
అందులో భాగంగా కాటేజీలో రామ్ చరణ్ మేకప్ వేసుకుంటుండగా, ఓ వానరం అక్కడకు వచ్చింది. చరణ్ మేకప్ వేసుకోవడం అయిపోగానే.. ఆ వానరానికి బిస్కెట్లు ఇచ్చాడు. అది సోఫాపైకి ఎక్కి చక్కగా బిస్కెట్లను తినింది. ఆ వీడియోకి ‘శ్రీ ఆంజనేయం.. ప్రసన్న ఆంజనేయం’ అనే స్లోకాన్ని నేపథ్య సంగీతంగా యాడ్ చేసి ట్విటర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి తన ట్విటర్ ఖాతా పేరును మార్చాడు. చిరంజీవి కొణిదెల అని ఉండే తన ట్విటర్ అకౌంట్ నేమ్‌ను ‘ఆచార్య’గా మార్చుకున్నాడు. ఇది ఆయన తాజాగా నటించిన సినిమా పేరు. ఈ నెల 29న ఈ మూవీ థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందకు రాబోతుంది.
నాపై విమర్శలు… నటనతోనే చెక్ పెడతా : కార్తికేయ