భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సినీ నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు అయ్యింది. మా ఎన్నికల్ల సందర్భంగా ”మా ఎన్నికల్లో ఘర్షణ ఏమిటి..ఏమిటీ గొడవలు..ఏమిటి బీభత్సం… నో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ,ఎవ్రీబడీ ఈజ్ అబ్జర్వింగ్… గొర్రెలు మేపుకునేవాడి దగ్గర కూడా సెల్ ఫోనుంది..అతనూ చూస్తున్నాడు ఏం జరుగుతుందని వ్యాఖ్యలు చేయడం జరిగింది.
దీంతో.. మోహన్ బాబు గారు వ్యాఖ్యలు చేయడం సరైంది కాదంటూ …గొర్ల కాపారుల వృతిని అవమానించారని..గొర్రెల కాపరులను కించపరిచేలా ఉన్నాయని ..వెంటనే మోహన్ బాబు గారి పై చట్టపరమైన చర్యలు తీసుకొని గొర్రెల కాపరుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరుతు బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది.
ఫిర్యాదు చేసిన వారిలో గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్షులు కలికినేని తీరీష్, సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బసినబోయిన గంగరాజు, రాము, లాలయ్య ఉన్నారు. ఈ సందర్భంగా గొర్రెల కాపరులకు మోహన్‌బాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.