telugu navyamedia
సినిమా వార్తలు

పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు..

ఆర్ఎక్స్ 100 సినిమా ఫేమ్, అందాల భామ పాయల్ రాజ్ పుత్ వివాదంలో చిక్కుకుంది. పెద్దపల్లి పట్టణంలో గత నెల 11న ఓ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవంలో వెళ్లిన హీరోయిన్‌పై కేసు నమోదు చేశారు. పాయల్ రాకతో పెద్దపల్లిలోని షాపింగ్ మాల్ ప్రాంగణంతో జనసందోహంతో నిండింది.  ఈ కార్యక్రమంలో ఆమె మాస్కు ధరించకపోవడంతోపాటు కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ జూనియర్ సివిల్ కోర్టులో పిటీషన్ దాఖలైంది.

Hotness Alert! Payal Rajput looks irresistible in a wild and wet pose | Telugu Movie News - Times of India

ఐతే షాపింగ్ మాల్ ఓపెనింగ్ సందర్బంగా పాయల్‌ రాజ్‌పుత్‌తో పాటు షాపు యాజ‌మాన్యం మాస్క్‌లు ధరించ లేదు, కనీసం భౌతిక దూరం కూడా పాటించ లేదు. షాపింగ్ మాల్ ప్రారంభం సందర్బంగా పెద్ద ఎత్తున జనం కూడా గుమిగూడారు.

ఎరక్క పోయి ఇరుక్కున్న పాయల్‌ రాజ్‌పుత్‌.. కేసు నమోదు.. | case filed on heroine payal rajput in peddapalli

దీంతో జూనియర్‌ సివిల్‌ ఇన్‌చార్జి జడ్జి పార్థసారథి సిఫార్సు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజేశ్‌ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన షాపు యజమానితోపాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.

payal raj put 1

Related posts