నటరత్న, పద్మశ్రీ ఎన్.టి.రామారావు గారు ద్విపాత్రాభినయం చేసిన సాంఘిక చిత్రం కె.సి.ఫిలిం ఇంటర్నేషనల్ వారి “సర్కస్ రాముడు” 01-03-1980 విడుదలయ్యింది.
నిర్మాత కోవై చెళియన్ కె.సి.ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కథ: ఆర్.కె.ధర్మరాజ్, మాటలు, స్క్రీన్ ప్లే: దాసరి నారాయణరావు, పాటలు: వేటూరి సుందరరామమూర్తి, సంగీతం: కె.వి.మహదేవన్, ఫోటోగ్రఫీ: ఎం.కన్నప్ప, కళ: భాస్కరరాజు, నృత్యం: సలీం, ఎడిటింగ్: కె.బాలు అందించారు.
ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, సుజాత, జయప్రద, రావుగోపాలరావు, మోహన్ బాబు, జయమాలిని, ప్రభాకర రెడ్డి, సావిత్రి , అల్లు రామలింగయ్య, ఝాన్సీ, త్యాగరాజు, కె.వి.చలం, ఏచూరి, చలపతిరావు తదితరులు నటించారు.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు కె.వి.మహాదేవన్ గారి సంగీత సారధ్యంలో
“సూరీడు చుక్కెట్టుకుంది జాబిల్లి పువ్వెట్టుకుంది” “రాముడంటే రాముడు సర్కస్ రాముడు”
“ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య”
“అమావాస్యకి పున్నమికీ రేగిందంటే మామో”
వంటి పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి
ఈ చిత్రం ఘన విజయం సాధించి విడుదలైన పలు కేంద్రాలలో 50 రోజులు ఆడింది.
6 కేంద్రాలలో (1 డైరెక్ట్ + 5 షిఫ్ట్) 100 రోజులు ప్రదర్శింపబడింది.
100 రోజులు ఆడిన కేంద్రాలు:-
1) రాజమండ్రి — అప్సర (డైరెక్ట్ )
2) గుంటూరు — శేష మహల్ (61రోజులు) + కృష్ణా పిక్చర్ ప్యాలెస్ 39 రోజులు.
3) విశాఖపట్నం — దసపల్లా చిత్రాలయా (97 రోజులు)
4) కాకినాడ — ఆనంద్ 61 రోజులు + లక్ష్మి 39 రోజులు
5) విజయవాడ — ఊర్వశి70MM + షిఫ్ట్ తో రామకృష్ణ
6) హైదరాబాద్ — సుదర్శన్ 70MM లో 62రోజులు +
షిఫ్ట్ తో 100 రోజులు ఆడింది.