telugu navyamedia
సినిమా వార్తలు

41 సంవత్సరాల “సింహం నవ్వింది”

నందమూరి తారకరామారావు గారు నటించిన రామకృష్ణ సినీ స్టూడియోస్ వారి “సింహం నవ్వింది” చిత్రం 03-03 -1983 విడుదలయ్యింది.

నందమూరి జయకృష్ణ సమర్పణలో నందమూరి హరికృష్ణ నిర్మాతగా రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ పై నందమూరి బాలకృష్ణ హీరో గా ఎన్టీఆర్ గారు టైటిల్ రోల్ తో నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు డి.యోగానంద్ దర్శకత్వం వహించారు.

ఈచిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, స్క్రీన్ ప్లే: డి. యోగానంద్, పాటలు: సి.నారాయణరెడ్డి, వేటూరి సుందర రామమూర్తి, సంగీతం: చక్రవర్తి, ఫోటోగ్రఫీ: నందమూరి మోహనకృష్ణ, కళ: గోఖలే, నృత్యం: సలీం, ఎడిటింగ్: ఆర్. విఠల్ అందించారు.

ఈచిత్రం లో ఎన్.టి.రామారావు, నందమూరి బాలకృష్ణ, ప్రభ, కళారంజని, నూతన ప్రసాద్, రాళ్ళపల్లి, త్యాగరాజు, అల్లూరి రామలింగయ్య, మమత, కాకినాడ శ్యామల, అన్నపూర్ణ, శ్రీలక్ష్మి తదితరులు నటించారు.

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి స్వరకల్పనలో వచ్చిన పాటలు
“ఒక్కసారి నవ్వు ఒక్క ముద్దు ఇవ్వు”
“ముంజ లాంటి చిన్నదాన లేత ముద్దులన్నీ దోచుకోనా”
“గువ్వా గువ్వా ఎక్కడికే గూటిలోకా తోటలోకా”,
“జాబిలి వచ్చింది, జాజులు తెచ్చింది” వంటి పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ, మలయాళ నటి కళారంజని హీరో, హీరోయిన్లు కాగా ఎన్టీఆర్ గారు టైటిల్ రోల్ పోషించారు. ఈ సినిమాను తమిళంలో శివాజీ గణేశన్, కార్తీక్ లతో “రాజా మరియాధాయ్” పేరు తో 1987 లో రీమేక్ చేశారు. ఈ చిత్రం యావరేజ్ నడిచి కొన్నికేంద్రాలలో 50 రోజులు వరకు ప్రదర్శింపబడింది…

Related posts