telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చాణక్య గా .. గోపీచంద్.. టైటిల్ లోగో విడుదల ..

gopichand 26 title logo released

నటుడు గోపిచంద్, మెహరీన్, జరీన్ ఖాన్ హీరో, హీరోయిన్స్‌గా, తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న సినిమాకి ‘చాణక్య’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, టైటిల్ లోగో రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. గోపిచంద్ 26వ సినిమా ఇది. స్పై థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇండియా, పాకిస్థాన్ బోర్డర్‌లో గల జైసల్మేర్ పరిసర ప్రాంతాల్లో జరిగింది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ జరుగుతుంది. జూన్ 12న గోపిచంద్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే అవకాశముందని తెలుస్తుంది. కెమెరా : వెట్రి, ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం : విశాల్ చంద్రశేఖర్, మాటలు : అబ్బూరి రవి, సమర్పణ : ATV, నిర్మాత : రామబ్రహ్మం సుంకర.

Related posts