telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘వేదాంతం రాఘవయ్య’గా సునీల్

vedantham-raghavayya

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్‌గా సునీల్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. అప్పట్లో సునీల్ లేకుండా ఏ సినిమా ఉండేది కాదు. ఆ తర్వాత సునీల్ జాతకం మారిపోయి కమెడియన్‌ నుంచి హీరోగా ఎదిగిపోయాడు. కానీ కమెడియన్‌గా ఎంతో పేరు తెచ్చుకున్న సునీల్‌కి హీరో ఇమేజ్ సరిపోలేదు. మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చి ‘డిస్కో రాజా’ సినిమాతో విలన్‌గా కొత్త గెటప్ ఎత్తారు. ఈ సినిమాలో ఆయన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. అందుకే ఇక నుంచి విలన్‌గా ట్రై చేయాలని అనుకుంటున్నట్లు ఓ సందర్భంలో అన్నారు. ఇటీవల ‘కలర్ ఫోటో’ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు సునీల్. తాజాగా మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సునీల్. ‘వేదాంతం రాఘవయ్య’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. మాస్ దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాకు కథ, మాటలను అందిస్తున్నాడు. ఈ సినిమాను 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ను హరీష్ శంకర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేయగా… దర్శకత్వం ఎవరు వహిస్తారనేది తెలియాల్సి ఉంది.

Related posts