telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్ సేతుపతి కుమార్తెకు అత్యాచార బెదిరింపులు… క్షమించమంటూ నిందితుడి వీడియో

Vijay-Sethupathi

శ్రీలంక మాజీ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌ 800లో నటించేందుకు విజయ్ సేతుపతి ఒప్పుకోగా.. అందులో నుంచి సేతుపతి తప్పుకోవాలంటూ కొంతమంది నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సేతుపతిని ఇబ్బంది పెట్టకూడదని భావించిన మురళీధరన్‌, తన బయోపిక్‌ నుంచి తప్పుకోవాలంటూ కోరారు. దీంతో 800 నుంచి విజయ్ తప్పుకున్నారు. అయినప్పటికీ కొంతమంది నిరసనలను ఆపలేదు. ఈ క్రమంలోనే అతడి కుమార్తెను అత్యాచారం చేస్తే గానీ విజయ్‌కి ఆ బాధ తెలీదంటూ రిత్విక్‌ అనే నెటిజన్ సోషల్ మీడియాలో కామెంట్‌ పెట్టాడు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడు శ్రీలంకలో ఉన్నాడని తెలియడంతో అరెస్ట్ చేసేందుకు ఇంటర్‌పోల్‌ సహకారాన్ని కోరారు. ఈ నేపథ్యంలో రిత్విక్ ఓ వీడియోను విడుదల చేశాడు. అలాంటి కామెంట్లు చేయడం తన తప్పేనని, అందుకు క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు. కరోనా లాక్‌డౌన్‌లో తన ఉద్యోగం పోయిందని, ఆ ఫ్రస్టేషన్‌లో తాను ఉన్నానని, శ్రీలంకలో తమిళుల ద్రోహీగా భావించే ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో విజయ్ సేతుపతి నటిస్తున్నాడని తెలియడంతో ఆ కోపాన్ని భరించలేకనే ఆ ట్వీట్ చేశానని అన్నాడు. ఇక ఈ వీడియోలో అతడి తల్లి కూడా మాట్లాడింది. తన కుమారుడు చేసిన చర్య తప్పేనని.. తమిళులు తమను క్షమించాలని కోరారు.

Related posts