telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిజినెస్ మ్యాన్ తో పెళ్ళికి సిద్ధమైన చందమామ ?

Kajal

చందమామ కాజల్ ఓ వైపు కుర్ర హీరోలతో నటిస్తూనే సినీయర్స్ కూడా రొమాన్స్ చేస్తోంది. కాజల్ ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా వస్తోన్న ఇండియన్ 2’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా కాజల్ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న ‘ఆచార్య’లో చిరంజీవి సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం కాజల్‌ చేతిలో తెలుగు, తమిళ, హిందీ చిత్రాలు ఉన్నాయి. తాజాగా ఈ బ్యూటీ పెళ్లి గురించిన ఆసక్తికర సమాచారం ఫిలింసర్కిల్స్ ని వేడెక్కిస్తోంది. ఇటీవలే 35వ పడిలోకి అడుగుపెట్టేసింది. అందుకే ఇప్పుడు అనూహ్యంగా మూడ్ ఛేంజ్ అయ్యిందట. సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చి పెళ్లాడేసే ఆలోచనలో ఉందిట చందమామ.ఇప్పటికే ఇంట్లో వాళ్లు వెతికే వరుడినే పెళ్లాడేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసిందట ఔరంగాబాద్‌కి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ తో కాజల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్త ఫిలింనగర్ లో వైరల్ అవుతోంది. వీరిద్దరి కుటుంబ సభ్యులు పెళ్లిపై ఇప్పటికే అన్ని మాట్లాడేసుకున్నారని, త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా చేయనున్నట్టు సమాచారం.

Related posts