telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మారుతీ దర్శకత్వంలో గోపీచంద్

Gopichand

మంచి హీరో గోపీచంద్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటిమార్’ అనే సినిమా చేస్తున్నాడు. ఎప్పటినుంచో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ ఆశలన్నీ సీటిమార్ సినిమా మీదే పెట్టుకున్నాడు. ఆ తరువాత తేజ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు గోపీచంద్. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ‘ప్రతి రోజు పండగే’ సినిమా తో హిట్ అందుకున్న మారుతీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక లాక్ డౌన్ టైమ్ లో మారుతీ మంచి మంచి కథలను రాసుకున్నారని వాటిలో గోపీచంద్ కు సరిపోయే అద్భుతమైన కథను ఫిక్స్ చేసారని తెలుస్తుంది.

Related posts