telugu navyamedia
సినిమా వార్తలు

కేఎల్ రాహుల్‌ తో ఎఫైర్ పై హీరోయిన్ ఫైర్

Sonal

బాల‌కృష్ణ‌కి జోడీగా లెజెండ్‌, డిక్టెట‌ర్ చిత్రాల‌లో న‌టించిన హీరోయిన్ సోనాల్ చౌహ‌న్, కేఎల్ రాహుల్‌ ల ఎఫైర్‌కి సంబంధించి ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుంది. రాహుల్‌తో ఎఫైర్‌కి సంబంధించి ప‌లు మీడియా సంస్థ‌ల ద్వారా ఈ అమ్మ‌డు క్లారిటీ ఇచ్చిన పుకార్ల‌కి బ్రేక్ ప‌డ‌డం లేదు. తాజాగా ఓ నెటిజ‌న్ “రూమ‌ర్స్ లేకుండా మీరు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌లేక‌పోతున్నారా ? రూమ‌ర్స్ లేక‌పోతే సినీ ప‌రిశ్ర‌మ‌లో మీకు మ‌నుగ‌డ కూడా ఉండ‌దు” అని పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన సోనాల్ “రూమ‌ర్స్ .. రూమ‌ర్స్‌.. రూమ‌ర్స్ .. ఎవ‌రు వీటిని పుట్టిస్తున్నారు అని ఘాటుగా బ‌దులిచ్చింది. ఆ త‌ర్వాతి ట్వీట్‌లో “మీరు ప్ర‌తి విష‌యంలో చాలా ఎక్స్‌ప‌ర్ట్‌లా క‌నిపిస్తున్నారు. విచారకరమైన జీవితంతో చాలా నిరాశ చెందారు. ప్రతి ఒక్కరి గురించి నెగెటివ్ కోణంలో ఆలోచించే మీ ప్రతికూల మనస్తత్వాన్ని మార్చడంపై మీరు దృష్టి పెట్టాలి. దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అని సోనాల్ పేర్కొంది. ప్ర‌స్తుతం కేఎస్ ర‌వికుమార్- బాల‌కృష్ణ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రంలో కథానాయిక‌గా న‌టిస్తుంది.

Related posts