telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సూపర్ స్టార్ కోసం బాలీవుడ్ విలన్ ?

Jocky

శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తమిళంలో ‘అన్నాత్తే’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో రజనీ సరసన ఖుష్బూ, మీనాలతో పాటు నయనతార, కీర్తి సురేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ నటిస్తున్నట్టు తాజాగా వెల్లడైంది. ఇది పవర్ ఫుల్ పాత్ర కావడంతో జాకీని తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇన్నాళ్లూ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఇక ఈ చిత్రం షూటింగ్ చాలావరకు లాక్ డౌన్ కి ముందే జరిగింది. అయితే ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలివుంది. దీనిని మరికొన్నాళ్లలో చెన్నైలో సెట్స్ లో చిత్రీకరిస్తారని తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నప్పటికీ, అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

Related posts