telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రియుడి బర్త్ డే కోసం భారీగా ఖర్చు చేసిన నయన్

Nayan

లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రస్తుతం వరుస టూర్లతో బిజీగా ఉంది. ఇటీవలె ఓనం పండుగ కోసం ప్రియుడు, డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో కలిసి నయన్ కొచ్చి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గోవాలో విఘ్నేష్ శివన్ ఇటీవల తన 35వ బర్త్‌డే వేడుకలను ప్రియురాలు నయనతారతో కలిసి జరుపుకున్నారు. వీరిద్దరు అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే విగ్నేష్ పుట్టినరోజు వేడుకలను నయనతార దగ్గరుండి జరిపించడమే కాకుండా ఖర్చంతా తానే భరించినట్లు తెలుస్తోంది. గోవాలో వీరిద్దరు మూడు రోజులు ఎంజాయ్ చేయగా.. అందుకోసం నయన్ ఏకంగా రూ.25 లక్షలు ఖర్చు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త కోలీవుడ్‌లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. విఘ్నష్ శివన్ దర్శకత్వం వహించిన నానుమ్‌ రౌడీదాన్ (తెలుగులో నేను రౌడీ నే) సినిమాలో నయనతార నటించారు. ఆ చిత్ర షూటింగ్‌లో ఇద్దరి పరిచయం ముదిరి ప్రేమగా మారింది. ఇప్పటి నుంచీ వీరిద్దరు రిలేషన్‌ కొనసాగిస్తున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తమకు కొన్ని కలలు ఉన్నాయని, వాటిని నెరవేర్చుకునే వరకు పెళ్లి చేసుకోమని విఘ్నేష్ ఇటీవల ఓ ఇంట్వర్యూలో చెప్పారు. ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతితో “కాదువాకుల రెండు కాదల్” అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో నయనతార, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Related posts