telugu navyamedia
సినిమా వార్తలు

పాప పోలిక విషయమై సమీరారెడ్డిపై విమర్శలు

Sameera-Reddy

సమీరా రెడ్డి ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. సినిమాలకు దూరమైనా, గర్భవతిగా ఉన్నప్పుడు ఫోటో షూట్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవలే సమీరా రెడ్డి రెండవ కాన్పులో పండంటి ఆడబిడ్డకు జన్మనించింది. కుమార్తె పుట్టిన తర్వాత సమీరా రెడ్డి తొలిసారి ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సమీరా రెడ్డి మాట్లాడుతూ “బుధవారం రోజు వైద్య పరీక్షలు చేయించుకున్నా. వైద్యులు నాకు సిజేరియన్ చేయాలని చెప్పారు. దీనితో శుక్రవారం అపాయింట్ మెంట్ తీసుకున్నా. ఆ రోజు తొలి ఏకాదశి. మా ఇంట్లోకి ఆడబిడ్డ ప్రవేశించిన రోజు అని సమీరా రెడ్డి తెలిపింది. నాకు పాప పుట్టిన తర్వాత చాలా కానుకలు వచ్చాయి. బహుశా పాప కోసం ఇప్పట్లో షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు అని సమీరా రెడ్డి సరదాగా తెలిపింది. ఇంతకీ పాప ఎవరి పోలిక అని విలేకరి ప్రశ్నించగా… సమీరా మాట్లాడుతూ “పాప నాలాగా నల్లగా లేదు. తెల్లగా ముద్దొచ్చేలా ఉంది. అందుకు నేను హ్యాపీ” చెప్పుకొచ్చింది. పాప పోలిక గురించి అడిగినప్పుడు రంగు గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి ? పాప ఏ రంగులో ఉంటే ఏంటి ? అంటూ నెటిజన్లు సమీరా కామెంట్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.

Related posts