telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఇలా చేస్తే జ‌లుబు, ద‌గ్గు మటాష్‌..!

ఇది వ‌ర‌కు అయితే ఏ చిన్న జ‌బ్బు వ‌చ్చినా అంటే.. జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు ఏవి వ‌చ్చినా వెంట‌నే టాబ్లెట్స్ వేసుకునే వారు. కానీ క‌రోనా నేప‌థ్యంలో అలా కాదు. ప్ర‌తీది ఇంట్లోనే త‌యారు చేసుకుంటున్నారు. ఇంటి చికిత్స‌కే మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ప‌నిలో ప‌నిగా ఇమ్యునిటీ ప‌వ‌ర్ పెంచుకునే ప‌నిలో కూడా ఉన్నారు. వ‌ర్షాకాలంలో వ‌చ్చే జ‌బ్బుల‌కు, క‌రోనాను రెండింటినీ అరిక‌ట్ట‌డానికి మిరియాలు ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయి. 
మిరియాలు :
పావు టీస్పూన్ మిరియాల‌ను నెయ్యిలో వేయించి బాగా పొడిచేసుకోవాలి. దీన్ని గోరువెచ్చ‌ని పాల‌లో వేసుకొని ఉద‌యాన్నే తాగితే జ‌లుబు నుంచి త‌క్ష‌ణ‌మే ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. లేదంటే వేయించిన మిరియాల‌ను అలానే తినేసినా ప‌ర్వాలేదు.
* నిమ్మ‌ర‌సంలో కొంచెం తేనె వేసి బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని ఉద‌యం, సాయ‌త్రం తాగితే జ‌లుబు త‌గ్గుతుంది. ఉద‌యాన్నే పాలు తాగేవారు అందులో చిటికెడు ప‌సుపు వేసుకొని తాగితే జ‌లుబు, జ్వ‌రం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.
* జ‌లుబును త‌గ్గించ‌డంలో అల్లం ఎంతో బాగ ప‌నిచేస్తుంది. బాగా మ‌రుగుతున్న నీటిలో అల్లం ముక్క వేసి మ‌రిగించాలి. ఇందులో కాస్త ప‌సుపు కూడా జోడించాలి. ఈ మిశ్ర‌మం బాగా మ‌రిగిన త‌ర్వాత ప‌క్క‌కు దించేయాలి. ఈ మిశ్ర‌మం గోరువెచ్చ‌గా అయిన త‌ర్వాత అందులో తేనె వేసుకొని తాగితే జ‌లుబు మాయ‌మ‌వుతుంది. అంతేనా దీనివ‌ల్ల రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరిగి క‌రోనా బారిన ప‌డ‌కుండా కాపాడుతుంది.
* ప్ర‌తిరోజూ ఇలా చేస్తూ ఉంటే చాలు క‌రోనా జాడే ఉండ‌దు. అంతేకాదు ప్ర‌తిరోజూ తాగేనీటిని వేడి చేసుకొని తాగ‌డం మంచిది.

Related posts