telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఇమ్యూనిటీ పవర్ పెంచే డ్రింక్‌…!

Health

ప్రస్తుతం కరోనా పరిస్థితుల వల్ల ఆరోగ్యంపై మరింతగా దృష్టి పెట్టాల్సి వస్తోంది. చాలామంది శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా లేకనే సమస్యల బారిన పడుతూ ఉంటారు. దీనికి జీవనశైలి ప్రమాణాలతోపాటు తీసుకునే ఆహారం, వయసు కూడా ప్రభావం చూపుతుంది. అందుకే రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఈ రెసిపీని ట్రై చేయండి.

కావాల్సిన పదార్థాలు :
గుప్పెడు నల్ల మిరియాలు
అల్లం
పది తులసి ఆకులు
ఒకటి లేదా రెండు స్పూన్ల తేనె

ఒక కప్పు నీరు తీసుకుని అందులో తులసి ఆకులను వేయండి. వీటిని కనీసం ఒక పది నిమిషాలపాటు నానబెట్టండి. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి, యాంటీ ఆక్సిడెంట్స్ పెంచడానికి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్దీకరించడానికి సహాయపడే గుణాలు ఈ తులసి ఆకులలో ఉన్నాయని పరిశోధనలలో కూడా తేలింది. ఇప్పుడు స్టౌ ఆన్ చేసి, ఒక గిన్నెలో ఈ తులసి నీటిని పోసి మరగనివ్వండి. ఆపై నల్లమిరియాలు, దంచిన అల్లం వేయండి. అల్లాన్ని తరచుగా వాడడం మూలంగా కీళ్ళ నొప్పులు తగ్గడమే కాకుండా, కడుపులో పూత నివారణలో కూడా సహాయపడుతుంది. ఈ మిశ్రమాన్ని 5 నుండి 10 నిమిషాలపాటు మరగనివ్వండి. అల్లం, యాంటీ ఆక్సిడెంట్ల పెరుగుదలలోనే కాకుండా, రక్తశుద్దికి కూడా సహాయపడుతుంది. అదనపు రుచి కోసం, దీనిలో తేనెను జోడించవచ్చు. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. రోజూ ఈ రసాన్ని తాగడం వలన, శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది., క్రమంగా అనేక ఆరోగ్య సమస్యలు తగ్గు ముఖం పడతాయి.

Related posts