telugu navyamedia
సినిమా వార్తలు

లాస్ ఏంజెల్స్‌లో రానా… ఎందుకంటే ?

Rana

“బాహుబలి”తో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ను సంపాదించుకున్న రానా దగ్గుబాటి ప్రస్తుతం తెలుగులో “విరాటపర్వం” సినిమాతో బిజీగా ఉన్నాడు. మరో వైపున తమిళ, హిందీ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రానా ఇప్పుడు తెలుగులో “విరాటపర్వం”, హిందీలో “హాథీ మేరే సాథీ” సినిమాల్లో నటిస్తున్నారు. యాడ్స్ లోను నటిస్తున్నాడు. అయితే “బాహుబలి” సినిమాలో కండలు తిరిగిన శరీరంతో కనిపించిన రానా ఈ మధ్య కాలంలో బాగా సన్నబడిపోయాడు. దాంతో రానా ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడనే ప్రచారం జరిగింది. రానా ఈ వార్తలను ఖండించినప్పటికీ అవి మాత్రం ఆగలేదు. అదే టైమ్‌లో రానా కూడా కనిపించకుండా పోవడం ఈ అనుమానాలకు బలం చేకూర్చాయి. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో కిడ్నీ మార్పిడి చికిత్స జరిగింది. ఇపుడిపుడే రానా కోలుకుంటున్నాడు. ఈ సందర్భంగా రానా.. లాస్ ఏంజెల్స్‌లో నేను కోలుకుంటున్నాను. వచ్చే నెలలో భారత దేశానికి తిరిగొస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం రానా..‘విరాట పర్వం’, ‘హిరణ్యకశ్యప’తో పాటు హిందీలో హౌస్‌ఫుల్ 4 సినిమాలతో పలకరించనున్నాడు.

Related posts