telugu navyamedia
సినిమా వార్తలు

‘పార్ధసారధి’గా జగపతి బాబు!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘లక్ష్య’. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శరత్ మరార్, నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి సీనియర్ నటుడు జగపతి బాబు లుక్ ను, ఆయన పాత్రను విడుదల చేశారు.

ఈ చిత్రంలో ‘పార్ధసారధి’ అనే పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు. ఈ పోస్టర్‌లో జగపతి బాబు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కన్పిస్తున్నారు. ప్రస్తుతం నాగ శౌర్య ఈ చిత్రంతో పాటుగా పోలీస్ వారి హెచ్చరిక, నారి నారి నడుమ మురారి, ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయి వంటి పలు సినిమాల్లో నటిస్తున్నాడు.

Related posts