telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అద్భుతం… ఆ యువకుడి టాలెంట్ కు బిగ్ బి ఫిదా…!!

Amitab

బిగ్ బి అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. క‌రోనాతో నానావ‌తి ఆసుప‌త్రిలో చేరిన అమితాబ్ బచ్చన్ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు టచ్‌లోనే ఉంటున్నారు. అయితే తాజాగా ఓ వీడియోను అమితాబ్ తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఓ యువ‌కుడు మౌత్ ఆర్గాన్ ప్లే చేస్తూ ఈ వీడియోలో కనపడ్డాడు. ఎలక్ట్రానిక్ వాయిద్య పరికరాలకు ధీటుగా కేవలం శ్వాసతోనే ఆ యువకుడు అద్భుతమైన సంగీతం వినిపించాడు. గ‌తంలో తాను ఎన్నడూ ఇటువంటి అద్భుత సంగీతం వినలేదంటూ అమితాబ్ ప్రశంసల జల్లు కురిపించారు. ‘అద్భుతం, అద్భుతం, అద్భుతం’ అని బిగ్‌ బీ పేర్కొన్నారు. కాగా ప్రజలకు కరోనాపై జాగ్రత్తలు చెబుతూ కూడా ట్వీట్లు చేస్తున్నారు. నానావ‌తి ఆసుప‌త్రిలోనే ఆయన కుమారుడు అభిషేక్‌ కూడా కరోనాకు చికిత్స తీసుకుంటున్నాడు. అమితాబ్ కోడ‌లు, సినీనటి ఐశ్వ‌ర్య‌రాయ్, ఆమె కూతురు నిన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Related posts