telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

తెలంగాణ సీపీగెట్ 2019 నోటిఫికేషన్‌ విడుదల

huge job notification in telanganaf

తెలంగాణ రాష్ట్రంలోని ఆరు విశ్వవిద్యాలయాలతోపాటు ఒక స్పెషలైజ్డ్ వర్సిటీలో ఉమ్మడిగా ఒకే పీజీ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ యూనివర్సిటీల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో, జేఎన్టీయూహెచ్‌లోని ఎంఎస్సీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 14 నుంచి 26వ తేదీ వరకు కామన్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్)-2019ను నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.

దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో పీజీ కోర్సులకు ఆన్‌లైన్‌లో ప్రవేశపరీక్షలను నిర్వహించనున్నామని చెప్పారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఈ మేరకు సీపీగెట్-2019 షెడ్యూల్, నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధంచేశామని, ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు.

Related posts