telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఈనాడు సంస్థలో చంద్రబాబు ఓ ఉద్యోగి: కొడాలి నాని

kodali nani ycp

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రామోజీరావు నడిపిస్తున్న ఈనాడు సంస్థలో చంద్రబాబు ఓ ఉద్యోగి అని అన్నారు. తెలుగుదేశం పార్టీలోకి అడ్డగోలుగా చొరబడి, ఆపై పార్టీని సర్వనాశనం చేసిన వ్యక్తి అని అన్నారు. నాడు వైస్రాయ్ హోటల్ లో 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేకుండా, 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఈనాడులో తప్పుడు కథనాలు రాయించుకున్న వ్యక్తి చంద్రబాబు అని నిప్పులు చెరిగారు.

నిన్న కావాలనే తనకు కేటాయించిన గేటులో నుంచి రాకుండా, ఓ పథకం ప్రకారం, బయటి వ్యక్తులను వెంటేసుకుని ఎమ్మెల్యేలు వచ్చే గేటులో నుంచి వచ్చారని ఆరోపించారు. అసెంబ్లీ నిబంధనలకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు, పోస్టర్‌ లను పట్టుకుని దౌర్జన్యం చేశారని అన్నారు. మార్షల్స్ పై బూతులు ప్రయోగించారని మండిపడ్డారు.

Related posts