telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

విజయ్‌కి తండ్రిగా యాక్షన్ కింగ్ అర్జున్..?

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే కనిపించనుంది. ఈ చిత్రం పూరీ కనెక్ట్స్ బ్యారర్ పై పూరీ, చార్మీలు కలిసి నిర్మిస్తున్నారు. అంతేకాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రూపొందిచనున్నారు. ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా నిలిచి ఇంకా మొదలు కాలేదు. విజయ్ చివరి చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ డిసాస్టర్ తరువాత విజయ్ చేస్తున్నసినిమా ఫైటర్, దీనిపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. కానీ టాలీవుడ్‌లో ఉన్న బాడ్ సెంటిమెంట్ వారిని కలవరపరుస్తోంది. ఈ సినిమాలో విజయ్‌కి తండ్రిగా యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పడు ఇవే ఫాన్స్‌కను భయపెడుతున్నాయి. ఎందుకనుకుంటున్నారు.. ఇప్పటి వరకు అర్జున్ సపోర్టింక్ పాత్రలో కనిపించిన ఏ ఒక్క తెలుగు సినిమా కూడా హిట్ అవ్వలేదు. వాటిలో ‘శ్రీ ఆంజనేయం‘, ‘లై’. ‘నా పేరు సూర్యా..నా ఇల్లు ఇండియా తో స్టైలిష్ స్టార్ కూడా ఫెయిల్ అయ్యాడు. ఈ సినిమాలు డిసాస్టర్‌లుగా మిగిలాయి. దాంతో ఇప్పడు విజయ్ సినిమాలో అర్జున్ సార్జా సపోర్టింగ్ కారెక్టర్ అంటే కాస్ ఆలోచిస్తున్నారు.

Related posts