telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అన్నదాతల పక్షాన మాట్లాడితే…కేసీఆర్ కు చిల్లర రాజకీయాల లాగా కనిపిస్తోందా…?

BJP Bandi sanjay

సీఎం కెసిఆర్ పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎం.పి బండి సంజయ్ కుమార్ మరోసారి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తున్నారని.. తాను చెప్పిన పంటనే సాగు చేయాలంటూ రైతుల్ని ఆందోళనకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని… అగాథంలోకి నెట్టేస్తున్నారని.. ప్రభుత్వం మక్కల కొనుగోలు విషయంలో గందరగోళానికి గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో భూసార పరీక్షలు నిర్వహించకుండా… నిర్బంధ సాగు విధానం అమలు చేయడం అశాస్త్రీయం కాదా…? అని ప్రశ్నించారు. ఏ భూమిలో ఏ పంట పండించాలో చెప్పకుండా మంత్రులు, వ్యవసాయ శాఖ అధికారులు అలసత్వం వహిస్తున్నారని.. కేసీఆర్ మాత్రం… ఫామ్ హౌజులో ఉండి హుకుం జారీ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. గతంలో కేసీఆర్ మాట నమ్మి… సన్న రకం వరి సాగు చేసిన రైతులు నష్టపోయారని.. ఇందుకు ఎవరు బాధ్యులు? అని నిలదీశారు. మార్క్ ఫెడ్ ద్వారా మక్కలు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యాపారులు లాభాలు గడిస్తుంటే… రైతులు ఎందుకు నష్టపోతున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఆందోళనలో ఉన్న అన్నదాతల పక్షాన నిలబడి మాట్లాడితే… కేసీఆర్ కు చిల్లర రాజకీయాల లాగా కనిపిస్తోందా…?అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ లో ఎకరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నట్టు గతంలో ప్రకటించారని.. కేసీఆర్ లాగా కోట్లు సంపాదించే టెక్నిక్ తెలియకపోవడం వల్ల రైతులు చిల్లర మనుషుల్లా కనిపిస్తున్నారా…? అని ప్రశ్నించారు.

Related posts