telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చిన అల్లుఅర్జున్…

టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ తన ఆరోగ్య పరిస్థితిపై తాజా సమాచారం వెల్లడించారు. ఇటీవలే కరోనా బారినపడిన అల్లు అర్జున్ హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. “నాకు చాలా తేలికపాటి లక్షణాలే ఉన్నాయి. నేను బాగా కోలుకుంటున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను ఇంకా సెల్ఫ్ ఐసోలేషన్ లోనే ఉన్నాను. ఇక తాను కరోనా బారినపడ్డానని తెలియగానే విశేష ప్రేమాభిమానాలు కురిపిస్తూ, తన కోసం ప్రార్థిస్తున్న అందరికీ కృతజ్ఞతలు అని తెలిపారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’తో బిజీగా ఉన్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత మరో స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయనున్న సీషయం తెలిసిందే.

Related posts