telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఇండియాకు అమెరికా ఫార్మా దిగ్గ‌జం సాయం…

ఈ కరోనా కష్ట కాలంలో చాలా దేశాలు భార‌త్‌కు అండ‌గా నిలుస్తూ వ‌స్తున్నాయి. కొంద‌రు ఆక్సిజ‌న్, మ‌రికొంద‌రు మందులు, ఇంకా కొంద‌రు ఇత‌ర సామాగ్రి ఇలా.. తోచిన సాయాన్ని చేస్తున్నాయి.. మ‌రికొన్ని దేశాలు భార‌త్ సాయాన్ని అందుకుని.. ఇప్పుడు రుణాన్ని తీర్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.. తాజాగా, భార‌త్‌ను ఆదుకోవ‌డానికి ముందుకు వ‌చ్చింది అమెరిక‌న్ ఫార్మా దిగ్గ‌జం ఫైజ‌ర్.. భార‌త్‌కు ఏకంగా 7 కోట్ల డాల‌ర్ల అంటే ఇండియ‌న్ క‌రెన్సీలో దాదాపు రూ.510 కోట్లు విలువైన మందులు పంపిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.. యూఎస్‌తో పాటు యూర‌ప్‌, ఆసియాలోని త‌మ డిస్ట్రిబ్యూష‌న్ సెంట‌ర్ల నుంచి ఈ మందులను భార‌త్‌కు పంప‌నున్న‌ట్లు ఫైజ‌ర్ చైర్మ‌న్ ఆల్బ‌ర్ట్ బౌర్లా వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం భార‌త్‌లో కోవిడ్ ప‌రిస్థితులు మ‌మ్మ‌ల్ని ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. భార‌త్‌ ప్ర‌జ‌ల కోసం మేం ప్రార్థిస్తున్నాం అని ఫైజ‌ర్ ఇండియాకు పంపిన మెయిల్‌లో ఆల్బ‌ర్ట్ బౌర్లా పేర్కొన్నారు. కోవిడ్‌పై భార‌త్ చేస్తున్న పోరాటంలో క‌లిసి ముందుకు సాగుతాం.. అందుకే అతిపెద్ద సాయం చేస్తున్న‌ట్టు తెలిపారు.

Related posts