telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

అతిథిగా ఇంటికి వచ్చిన ఆమె… ఓనర్ ను ఏం చేసిందంటే ?

New couples attack SR Nagar

న్యూజెర్సీ, సెడార్ గ్రోవ్‌లోని సన్‌రైజ్ టెర్రేస్‌లో నివాసముండే 86 ఏళ్ల వృద్ధురాలి ఇంటికి ఆదివారం రాత్రి ఓ మహిళ అతిథిగా వెళ్లింది. ఆ రోజు ఆమె ఇంట్లోనే పడుకున్న సదరు మహిళ సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వృద్ధురాలిపై కత్తితో దాడికి పాల్పడింది. అతి కిరాతకంగా కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారైంది. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు ఉదయం ఇరుగుపొరుగు వారి సహాయం కోసం అర్థించడంతో విషయం బయటకు తెలిసింది. రక్తపుమడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన ఆమెను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వృద్ధురాలిని పరీక్షించిన వైద్యులు ఆమె ఒంటిపై ఏకంగా 15 కత్తిగాట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలిలో రికార్డైన సీసీటీవీ కెమెరాలోని దృశ్యాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయం తెలిసింది. బాధితురాలి భవనంలోనే మొదటి అంతస్తులో ఉండే జార్జియాలోని కమ్మింగ్‌కు చెందిన తాన్యా స్పియర్స్(60) అనే మహిళనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. పరారీలో ఉన్న తాన్యా కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెపై హత్యాయత్నం, తీవ్ర దాడి కింద కేసు నమోదు చేసి ఎసెక్స్ కౌంటీ జైలుకు తరలించారు. దర్యాప్తు కొనసాగుతుందని చెప్పిన పోలీసులు వృద్ధురాలిపై తాన్యా ఎందుకు దాడి చేసిందనేది ఇంకా తెలియాల్సి ఉందన్నారు.

Related posts