telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రైతుల డిమాండ్లు నెరవేర్చాలంటున్న సోనియా గాంధీ…

sonia will decide team lead in haryana

ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలపై సోనియా గాంధీ స్పందించింది. మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే కేంద్రం రద్దు చేసి రైతుల డిమాండ్లు నెరవేర్చాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు. విపత్తును కేంద్రం అవకాశంగా మార్చుకుంటోందని అన్నారు.  చమురు ధరలను పెంచి ప్రభుత్వం తన ఖజానాను నింపుకుంటోందని అన్నారు.  ప్రభుత్వం స్పందించే సున్నితత్వాన్ని కోల్పోయి పేద, రైతు, మధ్యతరగతి వర్గాల వెన్ను విరిచేస్తోందని తెలిపారు.  కరోనాతో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిన సమయంలో మోడీ ప్రభుత్వం ఖజానాను నింపుకుంటోందని విమర్శించారు.  ముడి చమురు ధర రూ.23.43 మాత్రమే ఉండగా, కేంద్రం డీజీల్ ధర రూ.74.38, పెట్రోల్ రూ.84.20 రేట్లతో దోచుకుంటోందని, 73 ఏళ్లలో ఇదే అత్యధిక ధర అని సోనియా గాంధీ మండిపడ్డారు.  అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నా, ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందకుండా  ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచారని సోనియాగాంధీ విమర్శించారు. రూ.19 లక్షల కోట్లు జనం జేబుల నుంచి వసూలు చేసిందని అన్నారు.  ఇక గ్యాస్ సిలిండర్ ధరలను కూడా బీజేపీ ప్రభుత్వం పెంచినట్టు తెలిపారు. 

Related posts