telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అభిమానికి ఎన్టీఆర్ వీడియో కాల్

ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఒక అభిమాని కోరికను వీడియో కాల్‌ ద్వారా తీర్చాడు. నల్లగొండ జిల్లా చండూరు గ్రామానికి చెందిన వెంకన్న చిన్నతనం నుంచి ఎన్టీఆర్ వీరాభిమాని. అయితే ఆయనకు కొన్ని రోజుల క్రితం ఎల్బీనగర్‌లో బస్ నుంచి కింద పడ్డాడు. ఆ ప్రమాదంలో వెంకన్న స్పైనల్ కార్డు దెబ్బ తిని.. బాడీలో 90 శాతం అవయవాలు పని చేయకుండా ఉన్నాయి. ఒకసారి ఎన్టీఆర్‌ను కలిసి ఫోటో దిగాలనేది తన కోరిక అని తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న జూనియర్ కరోనా టైమ్‌లో రావడం కుదరక.. అభిమాని కోరికను తీర్చేందుకు వీడియో కాల్ చేసి అభిమానిని సంతోష పరిచాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా లాక్ డౌన్ వలన వాయిదా పడి తాజాగా మొదలైంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Related posts